కలకడ : ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ ముజీర్ కథనంమేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, ఎర్రకోటపల్లెపంచాయతీ, మల్లవరంవాండ్లపల్లె గ్రామానికి చెందిన మల్లూరి.రవీంద్రరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి (22) స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో బొంతలవారిపల్లెలో జరిగే జాతరకు బయలుదేరాడు.మార్గమధ్యలో బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సూచికబోర్డును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ ముజీర్ తెలిపారు.


