కలకడ: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని , ఎవరూ అధైర్యపడొద్దని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం కలకడలో కార్యకర్తలను కలిసి మాట్లాడారు. గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల ఎంపిక పూర్తి చేయాలని, పరిశీలన పూర్తి చేసిన వారికి మాత్రమే గుర్తింపు కార్డులు అందుతాయని అందరూ త్వరిత గతిన పరిశీలన పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్‌బూత్ అధ్యక్షుల ఎంపిక పక్రియ వెంటనే పూర్తి చేసి వైఎస్సార్ సీపీ కేంద్రకార్యాలయానికి పంపాలని సూచించారు. పెట్రోల్, డీసిల్ ధరల పెంపు దారుణమన్నారు. ధరల పెంపునకు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలకడ కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ మేధావుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, కార్మిక సంఘం అధ్యక్షులు లక్ష్మన్న, ఎస్సీ సంఘం మండల ఉపాధ్యక్షుడు నటరాజ్, టెక్నికల్ అప్‌డేట్ సభ్యుడు జాఫర్,జిల్లా మైనార్టీ సంఘం ఉపాధ్యక్షుడు కరీముల్లా, మండల మైనార్టీ కమిటీ సభ్యుడు ఎంపీ బాషఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి


