ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది | - | Sakshi
Sakshi News home page

ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

మా పాప నందినిని విజయవాడలోని గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌తోపాటు రెండు సార్లు లాంగ్‌టర్మ్‌ నీట్‌ కోసం రూ. 11 లక్షలు ఖర్చు పెట్టాను. ఈసారి నీట్‌ పరీక్ష బాగా రాసింది. ఫలితాలకు సంబంధించి విడుదలైన ప్రాథమిక కీలో 720 మార్కులకు 590 మార్కులు వచ్చాయి. కోచింగ్‌ సెంటర్‌ వాళ్లు కూడా మంచి కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలపైన నీళ్లు చల్లారు. మళ్లీ కోచింగ్‌కు పంపాలంటే ఆర్థికభారమే.

– పోలిరెడ్డి, చిన్నాయపల్లె,

బి. మఠం మండలం

ప్రభుత్వం బాధ్యత వహించాలి

నీట్‌ పేపర్‌ లీక్‌ విషయంపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. నా కొడుకుచేతన్‌రెడ్డి నీట్‌ పరీక్ష రాశాడు. పిల్లలు ఆందోళనకు గురవుతారు. ఎంతో కష్టపడి చదివితే పరీక్ష రద్దు చేస్తున్ననట్లు ప్రకటించడం దుర్మార్గం. మళ్లీ పరీక్ష అంటే విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది.

–నారాయణరెడ్డి, సప్తగిరినగర్‌, మదనపల్లె

నీట్‌ రద్దు బాధాకరం

నీట్‌ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. నా కుమార్తె నీట్‌ పరీక్ష రాసింది. ఏడాదికాలంగా విద్యార్థులు అహర్నిశలు కష్టపడి చదివిన చదువుకు సార్థకత లభించకపోవడం పాటు తిరిగి మళ్లీ పరీక్షను రాయాల్సి అవసరం రావడం దురదృష్టకరం. విద్యార్థులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. పరీక్షల నిర్వహణ సమయంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి.

–పఠాన్‌ మహమ్మద్‌ఖాన్‌

Advertisement
 
Advertisement
Advertisement