పోలీసుల రక్షణ కోరిన ప్రేమ జంట | - | Sakshi
Sakshi News home page

పోలీసుల రక్షణ కోరిన ప్రేమ జంట

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

మదనపల్లె టౌన్‌ : పెద్దల నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్‌ ను మదనపల్లెలో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ప్రేమ జంట మీడియాతో మాట్లాడుతూ.. పీలేరుకు చెందిన హేమకుమార్‌ రొంపిచర్లకు చెందిన నందిని గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఈ నెల 9న సత్యసాయి జిల్లాలోని కదిరి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నామన్నారు. మేజర్లైన తమ ఇద్దరి పెళ్లి విషయం పెద్దలకు తెలిసిపోవడంతో వారి నుంచి ప్రాణహాని పొంచి ఉందని చేసేదిలేక జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement