సాక్షి, మదనపల్లె: మహిళలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటాలు చేస్తామని ఐద్వా జిల్లా నూతన అధ్యక్షురాలు ఓబులమ్మ అన్నారు. ఐద్వా రెండోరోజు సభ శుక్రవారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో జరిగింది. ఈ సందర్బంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఓబులమ్మ, ప్రధాన కార్యదర్శి భాగ్యమ్మ, కోశాధికారి రెడ్డిప్రసన్న, కమిటీ సభ్యులుగా ఎస్.షాహినా, పార్వతి, సంధ్య, ప్రశాంతి, శంకరమ్మ, ఫాతిమాలను ఎన్నుకున్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు డీఆర్ మధురవాణి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు.


