సీటీఎం చెరువు వద్ద మృత శిశువు లభ్యం | - | Sakshi
Sakshi News home page

సీటీఎం చెరువు వద్ద మృత శిశువు లభ్యం

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలంలోని సిటిఎం చెరువు వద్ద బాలుడి మృత దేహం బుధవారం సాయంత్రం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మదనపల్లె– తిరుపతి హైవే పక్కన ముళ్ల పొదల్లో సుమారు ఏడాదిన్నర వయసున్న మృత శిశువును టవల్‌ లో చుట్టి పడవేసి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ చంద్ర మోహన్‌ స్థానికుల సాయంతో మృత శిశువును మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద లభించిన దుస్తులు, టవల్‌, నిక్కరు, టీషర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా చంపి శిశువును పడేసి వెళ్లారా లేక అనారోగ్యం కారణంగా చనిపోతే తెచ్చి ముళ్లపొదల్లో పారేశారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాలూకా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

యువకుడు ఆత్మహత్య

సంబేపల్లె : శాంతల హరి (20) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం సంబేపల్లె మండలంలో చోటు చేసకుంది. పోలీసుల వివరాలమేరకు.. మండల కేంద్రంలోని నామాలగుట్టకు చెందిన రమేశ్‌, కన్నమ్మల కుమారుడు హరి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబీలకులు తెలిపారు. అప్పటి నుంచి రాలేదు. దీంతో హరి కోసం కుటుంబీకులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలోనే బుధవారం మండల కేంద్రంలోని నల్లగంగమ్మ ఆలయం సమీపంలోని కొండపై ఉరికి వేలాడుతున్న హరిని గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు, బంధువులకు సమాచా రం అందించారు. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం రాయ చోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్న మ్మ బతుకుదెరువుకోసం కువైట్‌కు వెళ్లినట్లు సమాచారం. కువైట్‌ నుంచి కుమారుడికి కొంత నగదు పంపించింది. అందులో కొంత మొ త్తం మిస్‌ అయిందని కుటుంబపెద్దలు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement