కొంటే మోసపోయినట్లే | - | Sakshi
Sakshi News home page

కొంటే మోసపోయినట్లే

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

అంగళ్లు పరిసర ప్రాంతాల్లో 1750/1, 1751, 850, 569, 543 సర్వే నంబర్లలోని వెంచర్లకు పంచాయతీ, పీకేఎం ఉడా నుంచి ఎలాంటి అనుమతులు లేవు. రియల్టర్లు స్వార్థమే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు. వారి మాటలు నమ్మి ఇక్కడ ప్లాట్లు కొంటే మోసపోయినట్లే. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. కొన్నవారిని నట్టేట ముంచుతున్నారు. భవిష్యత్తు కోసం ఆశతో ఇక్కడ ప్లాట్లు కొంటే భంగపాటు తప్పదు. ఇంటి నిర్మాణానికి, విద్యుత్‌ కనెక్షన్‌కు అనుమతులు ఇవ్వరు. బ్యాంకులు రుణాలు ఇవ్వవు. విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్‌ కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దు. ప్లాట్లు కొనేవారు జాగ్రత్త పడక పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

–గంగయ్య, ఎంపీడీఓ, కురబలకోట

Advertisement
 
Advertisement
Advertisement