ఏపీఆర్‌జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఏపీఆర్‌జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

తిరుపతి అర్బన్‌ : ఏపీఆర్‌జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. విశ్వం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 24న నిర్వహించిన ఏపీఆర్‌జేసీ ఎంట్రెన్స్‌న పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లో వి.మోక్షిత్‌ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి.శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే.పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే.హర్షవర్ధన్‌ 11వ ర్యాంకు, కే.జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్‌.హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్‌ 14వ ర్యాంకు, బి. హర్షిత్‌ 15వ ర్యాంకు, పి.తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి.పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్‌ కుమార్‌, కే. ధోనీష్‌ 20వ ర్యాంకులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారని విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్‌. విశ్వనాథ్‌ రెడ్డి బుధవారం వెల్లడించారు. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకు విశ్వనాఽథ్‌రెడ్డితోపాటు విశ్వం అకడమిక్‌ డైరెక్టర్‌ విశ్వచందన్‌రెడ్డి, విశ్వశ్రీ, కరస్పాండెంట్‌ తులసీ విశ్వనాథ్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement