మదనపల్లె టౌన్ : భార్య కాపురానికి రాలేదని భర్త చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యకు యత్ని ంచిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. ఘటనపై జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె కదిరి రోడ్డు, అమ్మచెరువు మిట్టలో కాపురం ఉంటున్న రహీముల్లా కొడుకు చాంద్ బాషా (27) చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. భార్య హసీనా ఇటీవల భర్తతో గొడవ పడి అలిగి తన పుట్టింటికి వెళ్లి పోయింది. కాపురానికి రావాలని శుక్రవారం అత్తగారి ఇంటికి వెళ్లి భార్యను కోరి నప్పటికీ, ఆమె రాలేదు. ఇంటికి వచ్చిన చాంద్ బాషా జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఉన్న కత్తితో చేతి నరాలు కోసుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు చికిత్సలు అందించడంతో కోలుకుంటూ ఉన్నాడు. వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.


