వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

వాల్మీకిపురం : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు విష్ణుచైతన్య డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఆర్‌ఎంఎం కింగ్‌ ప్యాలెస్‌లో రాయలసీమ జోన్‌ వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంతకు ముందు స్థానిక టీటీడీ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి, పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు వాల్మీకులను అవసరాలకు ఉపయోగించుకొని, ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకుగా చూస్తున్నారే కానీ.. సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. వాల్మీకులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి కమిటీలను వేసి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి కొండన్న, భాస్కర్‌, సురేష్‌, వెంకటరెడ్డి, ఈశ్వరయ్య, నాగరాజు, ఆనంద, గోవిందు, శ్రీనివాసులు, టైలర్‌ రామక్రిష్ణ, రామచంద్ర, అనిల్‌, రాజు, శ్రీనాథ్‌, వంశీ, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement