ఇసుక టిప్పర్లపై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్లపై పోలీసుల దాడులు

May 15 2026 10:44 AM | Updated on May 15 2026 10:44 AM

గుర్రంకొండ: రక్షణ లేకుండా.. పట్టకట్ట కుండా వెళుతున్న ఇసుక టిప్పర్లపై ఎట్టకేలకు పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఇసుక టిప్పర్లకు జరిమానాలు విధించారు. బుధవారం ‘సాక్షి’లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై పోలీసులు స్పందించా రు. గురువారం ఎస్‌ఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలోని పోలీసులు ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారిపై ఇసుక టిప్పర్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ సుకపై పట్టలుగానీ, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా వెళుతున్న టిప్పర్లపై చర్యలు చేపట్టారు. రికా ర్డులు సరిగ్గాలేని ఇసుక టిప్పర్లను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌ వద్దే ఉంచేశారు. ఈసందర్బంగా డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై నిబంధనలు పాటించకుండా ఇసుక రవాణా చేపట్టేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement