మదనపల్లె సిటీ: ఆర్టీసీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO) రాము అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ–1 డిపోలో సిబ్బందికి నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నిరంతర విధుల్లో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతి మాట్లాడుతూ.. ఉద్యోగులు బయటి ఆహారాన్ని నివారించి, ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలని, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు ఎం. వెంకటరమణారెడ్డి, అమరనాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


