కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. నీట్ పరీక్షల నిర్వహణలో ప్రతి సారి వైఫల్యం కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షల్లో పారదర్శకత లేకపోవడంతో ఆక్రమాలు జరగడం, పేపర్లు లీక్ కావడం జరుగుతోంది. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి ఉన్నతమైన పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి. – బుడ్డన్న,
ఎస్టీయు మండల అధ్యక్షుడు, పుంగనూరు
గుణపాఠాలు నేర్వకపోవడం శోచనీయం
మా పాప పేరు ఫిర్దోస్‌కు ఇంటర్లో 922 మార్కులు వచ్చాయి. నీట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షను ఇంత అధ్వానంగా నిర్వహించడం దారుణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో జరిగిన సంఘటనల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్షను నిర్వహించాలి.
– షేక్ బాషు, విద్యార్థిని తండ్రి, కమలాపురం
నీట్ పరీక్షల్లో నిర్లక్షం
నీట్ పరీక్ష రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీట్ పేపర్లు లీక్ అవుతున్నాయి. దీని కారణంగా నిజాయితీగా పరీక్షలు రాసిన విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.పదేపదే లీకేజ్ అవుతుండడం చాలా దారుణం. ఎన్‌టీఏ పనితీరుపై సందేహాలు వస్తున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
– కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎస్టీయు అన్నమయ్య
జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, పుంగనూరు


