మదనపల్లె టౌన్: హెచ్‌ఐవీ బాధితులకు భరోసా ఇద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.ఆదివారం మదనపల్లె లో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీహెచ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తెలిపారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి క్లస్టర్ మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ..‘హెచ్‌ఐవీ బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ఐసీటీసీ కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇన్నామని తెలిపారు.అనంతరం మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, జిల్లా ఆసుపత్రి నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.


