జన్నారం డివిజన్‌లో అరుదైన పక్షి | - | Sakshi
Sakshi News home page

జన్నారం డివిజన్‌లో అరుదైన పక్షి

Feb 16 2026 7:19 AM | Updated on Feb 16 2026 7:19 AM

జన్నారం డివిజన్‌లో  అరుదైన పక్షి

జన్నారం డివిజన్‌లో అరుదైన పక్షి

జన్నారం: జన్నారం డివిజన్‌లో అరుదైన పక్షి పెరేగ్రిన్‌ పాల్కన్‌ కనిపించింది. అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లో కనిపించగా అత్యంత వేగంగా గంటకు 320 కి.మీ ప్రయాణం చేస్తాయి. 1.5 కి.మీ ఎత్తులో ఎగురుతూ కింద ఉన్న ఆహారం గమనిస్తుంది. ఆసియా వాటర్‌బర్డ్‌ సర్వే సందర్భంగా వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సమన్వయకర్త డాక్టర్‌ అనగంధుల వెంకట్‌.. జన్నారం అటవీ డివిజన్‌ కిష్టాపూర్‌ సరస్సు సమీపంలోని సెల్‌టవర్‌పై కూర్చుని ఈ పక్షిని గుర్తించి, ఫొటో తీశారు. 2021లో జన్నారంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ పై ఉన్న పక్షిని గుర్తించగా, తిరిగి ఇప్పుడు చూసినట్లు వెంకట్‌ గెలిపారు. చాలా ఎత్తులో ఎగురుతూ కింద ఉన్న ఆహారాన్ని గమనించి ఒక్కసారిగా కిందకు దూకే విధానాన్ని ‘స్టూ ప్‌’అంటారని తెలిపారు. క్షిపణి లాంటి శరీర ఆకారం ఉండడం వల్ల గాలిని చీల్చుకుంటూ అత్యంత వేగంతో ప్రయాణిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement