బీవోసీడబ్ల్యూ కార్మికులు, వారి పిల్లలకు విదేశీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం వివిధ దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు మంచి డిమాండ్ ఉంది. సరైన శిక్షణ, ప్రాథమిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ప్రభుత్వం చేపడుతున్న గుర్తింపు, డేటా సేకరణ కార్యక్రమం ద్వారా అర్హులైన అభ్యర్థులు సులభంగా ఎంపికయ్యే అవకాశముంటుంది. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత నైపుణ్యాల్లో శిక్షణ పొందడం, పని పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ఇందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
– స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు


