వలస కార్మికులకు భరోసా | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికులకు భరోసా

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

● నైపుణ్య శిక్షణ, సర్టిఫికెట్‌ అందజేత ● విదేశాల్లోనూ ఉపాధి కల్పనకు ఛాన్స్‌ ● ఉమ్మడి జిల్లాలో 1.2 లక్షల మంది ● ఇప్పటికే ఆర్‌పీఎల్‌ ప్రక్రియ ప్రారంభం

ఎవరు అర్హులంటే?

నిర్మల్‌ఖిల్లా: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల నైపుణ్యాలను పెంచి, వారికి మెరుగైన ఉ పాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల (బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వెల్ఫేర్‌ బోర్డు) సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆర్‌పీఎల్‌ (రికగ్నిషన్‌ ఆఫ్‌ ప్రి యర్‌ లర్నింగ్‌) ఆధారిత డేటాబేస్‌ నమోదు కార్యక్రమం ప్రస్తుతం జిల్లాలో అమలవుతోంది. ఈ కా ర్యక్రమం ద్వారా ఇప్పటికే పనిలో అనుభవమున్న కార్మికులకు అధికారిక గుర్తింపు లభించడంతో పాటు వారి నైపుణ్యాలకు అనుగుణంగా సర్టిఫికెట్లు అందించబడుతున్నాయి.దీంతో దేశవ్యాప్తంగా మా త్రమే కాకుండా విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశంఉందని కార్మికశాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం

ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలా బాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో దాదాపు లక్షా 20వేల మంది కార్మికులు న్నట్లు కార్మికశాఖ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తు న్నాయి. వీరికి విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు నమోదైన బీవోసీడబ్ల్యూ కార్మికుల ఆధారితులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. డేటా సేకరణలో భాగంగా అభ్యర్థుల పేరు, ఆధార్‌ సంఖ్య, మొబైల్‌ నంబర్‌, విద్య, వృత్తి వివరాలు, విదేశీ ఉపాధిపై ఆసక్తి తదితర వివరాలను నిర్దిష్ట నమూనాలో నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సేకరించిన సమాచారం కచ్చితంగా, పూర్తిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ చర్యల ద్వారా అర్హత గల యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించ డమే లక్ష్యంగా ప్రభు

త్వం ముందుకు సాగుతోందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

ఉపాధి అవకాశాలకు సరైన మార్గం

ఈ పథకం ద్వారా అధికారికంగా నమోదు కావడంతో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడమే కాకుండా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్మికులు ఉద్యోగావకాశాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. నైపుణ్యానికి గుర్తింపు రావడం ద్వారా వేతనాలు కూడా మెరుగుపడే అవకాశముంది. ఈ కార్యక్రమం కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాకుండా, నిర్మాణ రంగానికి నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందించే దిశగా ఒక కీలక ముందడుగు అని గల్ఫ్‌ కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

శిక్షణ ప్రత్యేకతలు

ఈ డేటాబేస్‌ నమోదు అంటే పేరు నమోదు మాత్రమే కాదు. ఇది పూర్తిస్థాయి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం. ఇందులో భాగంగా కార్మికులకు వారి పనికి సంబంధించిన ప్రాక్టికల్‌, థియరీ శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి గుర్తింపు సర్టిఫికెట్‌ ఇస్తారు. వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలకు యువతను అనుసంధానం చేస్తూ నైపుణ్యాలు పెంపొందించి సర్టిఫికేషన్‌ జారీ చేస్తారు.

ఈ పథకానికి రిజిస్టర్‌ అయిన బీవోసీడబ్ల్యూ కార్మికులు, ఆధార్‌ కార్డు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా 18 నుంచి 30ఏళ్లున్నవా రికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థులు కనీసం ఎని మిదో తరగతి చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌, విద్యార్హత పత్రాలు, విదేశాలకు వెళ్లే ఆసక్తి ఉంటే పాస్‌పోర్ట్‌ లాంటి పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement