కుంటాల: హనుమాన్ జయంతి, మహాదేవుని పౌర్ణమిని పురస్కరించుకుని కుంటాలలో శుక్రవారం నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్‌లో మహారాష్ట్రకు చెందిన మాధవ్ జావూర్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిద్రాలికి చెందిన సాయినాథ్ తలపడగా సాయినాథ్ గెలిచాడు. ఆయనకు రూ.5వేల నగదు అందజేసి శాలువాతో సన్మానించారు. సర్పంచ్ జక్కుల గజేందర్, ఉప సర్పంచ్ పరికిపండ్ల రమణ, జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, ఐకేఆర్ వ్యక్తిగత సహాయకుడు నాలం శ్రీనివాస్, నాయకులు రమణారావు, లక్ష్మణ్, గజ్జారాం, మహేందర్, దత్తాద్రి, కిషన్, మహిపాల్, కళ్యాణ్ గజేందర్, శివ తదితరులున్నారు.


