కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వం రాయితీపై అందిస్తు న్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై అధి కారులు కఠిన చర్యలు చేపట్టారు. శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణంలోని న్యూ స్వాగత్ హోటల్, స్వాగత్ హోటల్‌లో ఐదు సబ్సిడీ సిలిండర్లు, రీఫిల్లింగ్ కోసం ఉపయోగిస్తున్న డంపింగ్ మెషిన్ పరికరాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాణిజ్య సిలిండర్లకు ధర ఎక్కువగా ఉండడంతో ఖర్చు తగ్గించుకునేందుకు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాజ్‌కుమార్, శ్రీనివాస్, పోచయ్య పాల్గొన్నారు.


