వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

సిర్పూర్‌(టి): మండలంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన ముదురుకోల నర్సయ్య (54) అనే వ్యక్తి మార్చి 20న వరంగల్‌ నుంచి సిర్పూర్‌(టి)కి వచ్చి దేవార పండుగకు హాజరై తిరిగి 29న ఉదయం 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం వరంగల్‌లో పనిచేస్తున్న యజమాని సిరాజ్‌కు ఫోన్‌ చేసి అడుగగా ఇంకా రాలేదని చెప్పారు. కాగా, తన భర్తకు చదువు రాదని, ఫోన్‌ ఆపరేటింగ్‌ రాదని, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని సిర్పూర్‌(టి) పోలీస్‌ స్టేషన్‌లో అతడి భార్య మంగమ్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement