మంచిర్యాల మేయర్‌గా ‘ధర్ని’ | - | Sakshi
Sakshi News home page

మంచిర్యాల మేయర్‌గా ‘ధర్ని’

Feb 16 2026 7:19 AM | Updated on Feb 16 2026 7:19 AM

మంచిర

మంచిర్యాల మేయర్‌గా ‘ధర్ని’

● డిప్యూటీ మేయర్‌ కోసం ముగ్గురు మహిళా కార్పొరేటర్ల పోటీ ● అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

● డిప్యూటీ మేయర్‌ కోసం ముగ్గురు మహిళా కార్పొరేటర్ల పోటీ

సాక్షి ప్రతినిధి మంచిర్యాల: మంచిర్యాల మేయర్‌గా 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ ధర్ని మధూకర్‌, డిప్యూటీ మేయర్‌గా 54 డివిజన్‌ కార్పొరేటర్‌ సల్ల రమ్య ఎన్నిక కానున్నారు. అనేక సమీకరణాల మధ్య చివరకు ఇరువురికి పదవులు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో 60 డివిజన్లకు 44 కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కాగా నగరానికి చెందిన పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు మున్నూరు కాపు కులానికి చెందిన ధర్ని వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్‌ నుంచి వచ్చిన సీల్డ్‌ కవర్లో ఈ మేరకు పేర్లను సోమవారం అధికారికంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముందు సభ్యులకు వెల్లడించే అవకాశం ఉంది. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవుతున్న సల్ల రమ్య భర్త మహేష్‌ మంచిర్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. బీసీల్లో గొల్ల కురుమకు చెందిన మహేశ్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు వీరాభిమాని. దీంతో ఆయన సతీమణికి డిప్యూటీ మేయర్‌ పదవి దక్కింది. అయితే డిప్యూటీ మేయర్‌ పదవి కోసం వెలమ, వైశ్య సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఆదివారం రాత్రి వరకు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో డిప్యూటీ మేయర్‌ విషయంలో ఇంకా ఎవరికై నా ఇస్తారా? అని సందిగ్ధం నెలకొంది. కాగా ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అంతా షిరిడీకి వెళ్లగా ఆదివారం తెల్లవారుజామున మంచిర్యాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం జరిగే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు హాజరుకానున్నారు.

నేడు పాలకవర్గ ప్రమాణ స్వీకారం

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదటి పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 60 డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లు సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ కోసం ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరించి, ఆయా అభ్యర్థులకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. కార్పొరేట్‌ అభ్యర్థులు చేయి ఎత్తి ఓటు వేయడం ద్వారా మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఉన్న హాలులో 60 మంది కార్పొరేటర్లు కూర్చునేందుకు అవకాశం లేకపోవడంతో కార్యాలయ ఆవరణలో టెంట్‌ వేశారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మంచిర్యాల మేయర్‌గా ‘ధర్ని’1
1/2

మంచిర్యాల మేయర్‌గా ‘ధర్ని’

మంచిర్యాల మేయర్‌గా ‘ధర్ని’2
2/2

మంచిర్యాల మేయర్‌గా ‘ధర్ని’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement