బాల్‌ బ్యాడ్మింటన్‌ వరల్డ్‌కప్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బాల్‌ బ్యాడ్మింటన్‌ వరల్డ్‌కప్‌ పోటీలకు ఎంపిక

Feb 16 2026 7:19 AM | Updated on Feb 16 2026 7:19 AM

బాల్‌ బ్యాడ్మింటన్‌ వరల్డ్‌కప్‌ పోటీలకు ఎంపిక

బాల్‌ బ్యాడ్మింటన్‌ వరల్డ్‌కప్‌ పోటీలకు ఎంపిక

రెబ్బెన: ఇండోనేషియాలో ఈనెల 16 నుంచి 20 వరకు జరగబోయే వరల్డ్‌కప్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన దేవల్ల శ్రావణి ఎంపికై నట్లు అసోషియేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్‌.తిరుపతి తెలిపారు. 2017లో కేరళలో సబ్‌ జూనియర్‌ నేషనల్స్‌, 2019లో ఎస్జీఎఫ్‌, 2022లో మహారాష్ట్రలో సీనియర్‌ నేషనల్‌, 2025లో తమిళనాడులో సీనియర్‌ నేషనల్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినట్లు పేర్కొన్నారు. ఇండోనేషియాలో వరల్డ్‌కప్‌ బాల్‌ బ్మాడ్మెంటన్‌ పోటీల్లో ఇండియా తరపున ఆమె పాల్గొంటుందని వివరించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొత్లపెల్లి శ్రీనివాస్‌, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.నారాయణరెడ్డి, కోశాధికారి శంకర్‌, ఉపాధ్యక్షులు భాస్కర్‌, మహేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, క్రీడాకారులు ఆమెను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement