ధ్వని పెరిగితే దండనే..
ప్రాంతాలవారీగా శబ్ధ కాలుష్యంపై నిబంధనలు అనుమతులుంటేనే మైక్‌లు వినియోగించాలి లేకపోతే చర్యలే
మంచిర్యాలటౌన్: ఎన్నికలు వచ్చాయంటే వాడవాడల్లో మైక్‌ల మోత మార్మోగడం సాధారణమే. అభ్యర్థులు ప్రచారం కోసం లౌడ్ స్పీకర్లు వినియోగిస్తుంటారు. వేదికలపై కాకుండా వాహనాలకు బిగించి వీధులు, ప్రధాన రహదారుల్లో ప్రచారం చేస్తుంటారు. దాదాపు మైకుల్లో ప్రచారం చేయడంతో పెద్దఎత్తున శబ్ధకాలుష్యం పెరిగిపోనుంది. ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు లౌడ్ స్పీకర్ల ప్రచారంతో విద్యార్థులు, చిన్నపిల్ల లు, వృద్ధులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మైకుల నిషేధం సాధ్యం కాకపోవడంతో ప్రమాణాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పట్టణాన్ని ఏ, బీ, సీ, డీ కేటగిరీగా విభజించింది. నిశ్శబ్ద మండలం, నివాసిత, వాణిజ్య, పారి శ్రామిక ప్రాంతాలుగా విభజించి అక్కడ విని యోగించే సౌండ్ ఎన్ని డెసిబుల్స్‌లో ఉండాలనేది నిర్ణయించింది. ఈనెల 9వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం వాడవాడల్లో హోరెత్తించనున్న పోటీలో పాల్గొనే అభ్యర్థులు సౌండ్ విషయంలో మాత్రం ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే.
ఆయా ప్రాంతాల్లో వినియోగించే సౌండ్
(డెసిబుల్స్‌లలో)
ఏరియా పగలు రాత్రి
నిశ్శబ్ద మండలం 50 40
నివాసిత ప్రాంతం 55 45
వాణిజ్య ప్రాంతం 65 55
పారిశ్రామిక ప్రాంతం 75 70


