62 కిలోల గంజాయి దహనం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో 14 కేసుల్లో పట్టుబడిన 62 కిలోల గంజాయిని జిల్లా గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం దహనం చేశారు. 52.5 కిలోల గంజాయి మొక్కలు (220 మొక్కలు), 9.5 కిలోల ఎండు గంజాయిను నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద ఉన్న శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్‌లో దహనం చేశారు. ఈ ప్రక్రియను అడిషనల్ ఎస్పీ బి.సురేందర్‌రావు పర్యవేక్షించారు.
ప్రహరీని ఢీకొట్టిన లారీ
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ అదుపుతప్పి ఇంటి ప్రహరీని ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన లారీడ్రైవర్ సోయబ్..భైంసా నుంచి నిర్మల్ వైపు వెళ్తున్నాడు. లారీని అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ మార్గమధ్యలో అయ్యవార్ల సుదర్శన్ ఇంటి ప్రహరీని ఢీకొట్టాడు. ప్రహరీ కూలి డ్రైవర్ సోయాబ్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు గమనించి అందించిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు.
62 కిలోల గంజాయి దహనం


