మంచిర్యాలఅగ్రికల్చర్: నిజాం నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం చేశారని తెలిపారు. వెట్టిచాకిరీ విముక్తి కోసం ఎన్నో పారాటలు చేశారని, యువతకు మార్గదర్శకులని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖల అధికారులు భాగ్యవతి, దుర్గప్రసాద్, వ్యవసాయ అధికారి సురేఖ, మాదవ, కురుమ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


