ఎన్నికల సామగ్రి పంపిణీ, లెక్కింపు కేంద్రం పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ శుక్రవారం పరిశీలించారు. ముల్కల్ల శివారులోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయగా చేపట్టాల్సిన బందోబస్తు తదితర వాటిని పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, హాజీపూర్ ఎస్సై కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.


