● పురుషులతో సమంగా మహిళా అభ్యర్థులు ● విద్యార్థులు, గృహి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహిళలు రాజకీయాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. వంటింటికే పరిమితం కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. మహిళలకు రిజర్వు చేసిన వార్డులతోపాటు జనరల్ వార్డుల్లోనూ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలో మొత్తంగా పురుష అభ్యర్థులకు దీటుగా ఎన్నికల బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల్లో ప్రతీ మున్సిపాల్టీల్లో సగం స్థానాలు మహిళలకు రిజర్వు చేయగా.. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్ స్థానాల్లోనూ పోటీకి నిలిచారు. దీంతో అతివల సంఖ్య పెరిగింది. కుటుంబంలో రాజకీయాల్లో ఉన్న భర్తల ప్రోత్సాహంతో కొందరు రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల తల్లులు, కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులను బరిలో నిలిపారు. కుటుంబ సభ్యులు వారి వెంట ఉంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో క్యాతనపల్లి జనరల్ మహిళ, చెన్నూరు బీసీ మహిళా, బెల్లంపల్లి జనరల్ మహిళకు చైర్‌పర్సన్ స్థానాలు ఖరారయ్యాయి. జిల్లాలో కార్పొరేషన్‌తో సహా నాలుగు మున్సిపాలిటిల్లో మొత్తం 149వార్డుల్లో సీ్త్ర, పురుషులు కలిపి 693మంది పోటీ చేస్తున్నారు. వీరిలో మంది 324మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలామంది ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీలు, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ వంటి ఉన్నత చదవుల వారున్నారు. కొందరు కనీసం రాయడం, చదవడం వరకు తెలిసిన వారు ఉన్నారు. రాజకీయాలు అంటే తెలియని గృహిణులు, వ్యాపారస్తులు ఉన్నారు. వయస్సు పరంగా చూస్తే కనీసం 21ఏళ్లు, గరిష్టంగా 60ఏళ్లు ఉన్న వారు బరిలో తలపడుతున్నారు. మరోవైపు అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో గెలుపోటములపైనా మహిళలే ప్రభావం చూపనున్నారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీల్లో 34వార్డులు ఉండగా.. వీటిలో ఎస్సీ మహిళకు 5, బీసీ మహిళకు 3, జనరల్ మహిళకు 9వార్డులు రిజర్వు చేశారు. వీటితోపాటు ఎనిమిది జనరల్ వార్డుల్లోనూ మహిళలు తలపడుతున్నారు. చైర్‌పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. కై వసం చేసుకోవడానికి భర్త, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మహిళలు ఎన్నికల్లో అమీ తుమీకి సిద్ధమయ్యారు. రాజకీయ వారసత్వంగా కొందరు మగువలు బరిలో ఉన్నారు.
విద్యావంతుల లెక్క ఇలా..
బెల్లంపల్లిలో విద్యావంతులైన మహిళలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 98 మంది మహిళలు పోటీలో ఉండగా వీరిలో 8 మంది ఐదో తరగతి వరకు, 52 మంది పదో తరగతి పూర్తి చేశారు. 25 మంది ఇంటర్మీడియెట్, 8 మంది డిగ్రీ, ఒకరు బీకాం బీఎడ్, ఒకరు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయగా, మరొకరు ఎంఏ బీఎడ్ చదివారు. మరో ఇద్దరు మహిళలు చదవడం, రాయడం వరకు నేర్చుకున్నారు.
వయస్సుల వారీగా..
బెల్లంపల్లిలో పుర ఎన్నికల్లో నవతరం పోటీ పడుతోంది. అతి పిన్న వయస్సు నుంచి వయోవృద్ధులు బరిలో ఉన్నారు. కనిష్టంగా 25 ఏళ్ల నుంచి గరిష్టంగా 65 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు పోటీ చేస్తున్నారు. 25–30 ఏళ్ల మధ్య 23 మంది, 31–40 ఏళ్ల వయస్సున్న మహిళలు 48 మంది, 41–50 ఏళ్ల మధ్య 19 మంది, 51–60 ఏళ్లు ఉన్నవారు 6, 60–65 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు ఇద్దరు ఉన్నారు.
కార్పొరేషన్‌లో అతివలు ముందంజ
జిల్లా కేంద్రంలో అత్యధికంగా మహిళలు కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 60డివిజన్లలో 59ఏళ్ల వయస్సులో మహిళ అభ్యర్థి ఉండగా, కనిష్టంగా 21ఏళ్ల యువతి అభ్యర్థిగా ఉన్నారు. పోటీలో ఉన్నవారిలో 98మంది గృహిణులు, ఐదుగురు వ్యాపార రంగం, మరో ఐదుగురు ఒకరు ప్రైవేటు ఉద్యోగిగా ఉన్నారు. 15మంది నిరాక్ష్యరాసులు, మిగతా వారంతా డిగ్రీలోపు, డిగ్రీపై చదివిన వారున్నారు. జిల్లా కేంద్రంలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఇంకా చదువుకునే విద్యార్థులు ఉండడం గమనార్హం.
మున్సిపల్/నగరం డివిజన్లు అభ్యర్థులు మహిళలు మంచిర్యాల 60 240 126బెల్లంపల్లి 34 173 98
క్యాతనపల్లి 22 113 25
చెన్నూరు 18 107 50
లక్షెట్టిపేట 15 60 24
మొత్తం 149 693 324
● పురుషులతో సమంగా మహిళా అభ్యర్థులు ● విద్యార్థులు, గృహి
● పురుషులతో సమంగా మహిళా అభ్యర్థులు ● విద్యార్థులు, గృహి
● పురుషులతో సమంగా మహిళా అభ్యర్థులు ● విద్యార్థులు, గృహి
● పురుషులతో సమంగా మహిళా అభ్యర్థులు ● విద్యార్థులు, గృహి


