రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

దహెగాం: గుడి నిర్మాణం కోసం చందాలు వసూలు చేయడానికి వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న క్రమంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, ఎస్సై విక్రమ్‌ తెలిపిన వివరాల ప్రకారం. కన్నెపల్లి మండలం చింతపుడి లింగాల గ్రామానికి చెందిన ఎల్కరి అంకన్న (49), అగాడి మల్లయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై గురువారం దహెగాం మండలానికి వచ్చాడు. లింగాల గ్రామంలో శివాలయం నిర్మాణానికి తెలిసిన వారి వద్ద చందాలు తీసుకుని రాత్రివేళ ఇంటికి బయలుదేరాడు. మండలంలోని చంద్రపల్లి గ్రామంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభానికి ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అగాడి మల్లయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మల్లయ్యను అంబులెన్స్‌లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ముత్యాలు ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలి పారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నా రు. కాగా, చంద్రపల్లిలో విద్యుత్‌ స్తంభం రోడ్డుకు ఆనుకుని ఉండడంతోనే ప్రమాదం జరిగినందున దానిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పలుసార్లు కోరినా విద్యుత్‌ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. అయితే, అంకన్న హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement