‘ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి’
చెన్నూర్: ఆరుగ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 14, 7, 6, 17వ వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారని, వారిని గెలిపిస్తే మన భూములు అమ్ముకుంటారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.


