‘కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం’
మంచిర్యాలటౌన్/నస్పూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల నగరంలోని 12, 13, 41, 42, 43, 44, 58వ డివిజన్ల కార్నర్ మీటింగ్‌ను శనివారం సాయంత్రం రాంనగర్ సబ్‌స్టేషన్ వద్ద నిర్వహించారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంటు ఎమ్మెల్యే గణేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పర్చుకుని నివాసం ఉంటున్న అర్హులందరికీ దసరాలోపు ఇళ్ల పట్టాలు పట్టాలు ఇప్పిస్తానని తెలిపారు. తాను చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కొక్కిరాల చరణ్‌రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.


