కేసీఆర్‌ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ

Feb 8 2026 4:20 AM | Updated on Feb 8 2026 4:20 AM

కేసీఆర్‌ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ

కేసీఆర్‌ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ

● మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి

● మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి

చెన్నూర్‌: రాష్ట్రాన్ని దోచుకున్న సంపాదనతో కేసీఆర్‌ ఫ్యామిలీలో ఆస్తుల పంచాయితీ నడుస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. చెన్నూర్‌ పట్టణంలోని 6, 7, 12వ వార్డుల్లో శనివారం ఆయన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ఆర్థిక విధ్వంసానికి గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఆర్కే–5 గనిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, మాజీ జెడ్పీటీసీ పోటు చిన్నరాంరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement