అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

Feb 8 2026 4:20 AM | Updated on Feb 8 2026 4:20 AM

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఆహార భద్రత శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివా రం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్యతో జిల్లా అధికారులు, ఆహార భద్రత అధికారి వాసురామ్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, ఆహార సంబంధిత వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి నమూనాలు సేకరించి నాణ్యత ప్రమాణాలు పరీక్షించాలని తెలిపారు. ఫిర్యాదులకు 7981904028 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

బెల్లంపల్లి: వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం బెల్లంపల్లిలోని ఎస్సీ సమీకృత బాలికల వసతిగృహంలో ఫుడ్‌ ఫాయిజన్‌ జరిగి అస్వస్థతకు గురై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సీహెచ్‌.దుర్గాప్రసాద్‌తో కలిసి సమీకృత బాలికల వసతిగృహాన్ని కలెక్టర్‌ సందర్శించారు. వార్డులు, వంటశాల పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement