ఓసీపీపై కార్మికుల ఆందోళన
జైపూర్: మండలంలోని ఇందారం ఐకే–ఓసీపీపై గనిపై కాంట్రాక్టు కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. రెండు నెలలుగా డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, సర్వే, బ్లాస్టింగ్ కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లిస్తూ ఈ నెల మొత్తానికి చెల్లించకపోవడం, సంవత్సరం బోనస్ కూడా ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులపై కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సుమారు 300మంది కార్మికులతో పని చేస్తున్న సంస్థ ముందస్తు సమాచారం లేకుండా పనులు నిలిపివేసినట్లుగా తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఓబీ పనుల తొలగించకుండా మట్టి తొలగించిన ప్రాంతాల్లో బొగ్గు వెలికి తీస్తూ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోందని తెలిపారు. సింగరేణి అధికారులు మాట్లాడు తూ వేతనాలు అందించే విధంగా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


