కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రానికి చేకూరిందేమీ లేకపోగా ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు. సింగరేణి సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులను ఈ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేయకుండా హరీశ్‌రావు వంటి వారు వారి ప్రాంతంలో స్టేడియంలు నిర్మించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక కొత్త గనుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ దక్కాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పల్లె రాజు, నీలం శ్రీనివాస్‌గౌడ్, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


