అభివృద్ధి, సంక్షేమానికి ఓటేశారు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమానికి ఓటేశారు

Feb 12 2026 7:13 AM | Updated on Feb 12 2026 7:13 AM

అభివృద్ధి, సంక్షేమానికి ఓటేశారు

అభివృద్ధి, సంక్షేమానికి ఓటేశారు

● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాలటౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు ఓటు వేశారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా 52వ డివిజన్‌ 222 పోలింగ్‌ కేంద్రంలో బుధవారం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల తన కాలుకు శస్త్రచికిత్స జరగ్గా, ఇబ్బంది పడుతూనే పోలింగ్‌ కేంద్రానికి సహాయకులతో చేరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతీ పౌరుడు ఓటును బాధ్యతగా వినియోగించుకుని, పూర్తి ఆలోచనతో ఓటు వేయాలని సూచించారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు లక్సెట్టిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement