స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్‌బాక్సులు | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్‌బాక్సులు

Feb 12 2026 7:13 AM | Updated on Feb 12 2026 7:13 AM

స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్‌బాక్సులు

స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్‌బాక్సులు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): నగరంలోని 60 డివిజన్ల పరిధిలోని 265 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ బాక్సులు ముల్కల్ల ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములకు చేరుకున్నాయి. బ్యాలెట్‌ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య తరలించి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో భద్రపర్చారు. 10 రూట్లలోని బస్సుల ద్వారా రాత్రి 7 గంటల నుంచి మొదలు రాత్రి వరకు కూడా అన్ని డివిజన్లలోని బ్యాలెట్‌ బాక్సులు తరలించగా.. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ పర్యవేక్షణలో స్ట్రాంగ్‌ రూంలో భద్రపర్చి సీజ్‌ చేశారు. డీసీపీ భాస్కర్‌ ఆధ్వర్యంలో స్ట్రాంగ్‌ రూం వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా, ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ ఆధ్వర్యంలో ఏసీపీ ప్రకాశ్‌, మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు, పలువురు సీఐలు, ఎస్సైలు మొత్తం 300 మంది వరకు బందోబస్తులో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement