మంత్రి అధికార దుర్వినియోగం
చెన్నూర్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉంటూ ప్రచారం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్ల కండువా కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మోటార్‌సైకిళ్లపై తిరుగుతున్న ఫొటోలను ప్రదర్శించారు. 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచారని తెలిపారు. జైపూర్ ఏసీపీ, చెన్నూర్ సీఐ బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మల్లెల దామోదర్‌రెడ్డి, మోతె తిరుపతి, నర్సింహచారి, విద్యాసాగర్, రాకేశ్‌గౌడ్, ఆసంపల్లి సంపత్‌కుమార్ పాల్గొన్నారు.


