పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
జిల్లాలో తగ్గిన పోలింగ్
చెన్నూరులో 75.85శాతం నమోదు
అత్యల్పంగా మంచిర్యాలలో 64.90శాతం
మొత్తంగా 2.01లక్షల మంది ఓటు వినియోగం
రేపటి కౌంటింగ్‌లో వెలువడనున్న అభ్యర్థుల భవితవ్యం
ఎగ్జిట్ పోల్స్‌తో అభ్యర్థుల్లో మిశ్రమ స్పందన
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
జిల్లాలో 68.60శాతం నమోదు
ముల్కల్ల 16వ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బుధవారం ఉదయం 7గంటల నుంచే పలు చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జిల్లా కేంద్రంతో సహా బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో స్వల్ప ఘటనలు మినహా అన్ని చోట్ల సవ్యంగా పోలింగ్ ముగిసింది. మంచిర్యాల నగరంలో ఉదయం 9గంటల వరకు పది శాతంలోపే పోలింగ్ నమోదు కాగా, మిగతా చోట్ల 11శాతానికి పైగా, తర్వాత 11గంటలకు 30శాతం వరకు, ఒంటి గంట వరకు సగం ఓట్లు పోలయ్యాయి. చాలా బూత్‌ల్లో మందకొడిగా మొదలైన పోలింగ్ పది గంటల తర్వాత సాయంత్రం 5వరకు చాలా చోట్ల ఓటర్లు కనిపించలేదు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా పటిష్ట బందోబస్తును నిరంతరం పరిశీలించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం. జిల్లాలో మొత్తం 2,94,297 ఓటర్లు ఉండగా, 201875మంది ఓటేశారు. మిగతా 92,422మంది ఓటుకు దూరంగా ఉన్నారు. వీరిలో మృతులు, వలసవెళ్లిన, డబుల్ ఓటర్లు కూడా ఉన్నారు.
పోలింగ్ పదనిసలు
పోలింగ్‌కు రెండు రోజుల ముందే పోల్ చీటిలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ చాలామందికి అందలేదు. దీంతో మంచిర్యాల నగరం, బెల్లంపల్లి, చెన్నూరు పట్టణాల్లో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీ అభ్యర్థులే చీటిలను పంపిణీ చేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తమ కుటుంబానికి స్థానిక బీఎల్‌వోలు పోల్ చీటిలు ఇవ్వలేదని వాపోయారు. మంచిర్యాల నగరంలో కాంగ్రెస్ అభ్యర్థి తన ఫొటోతో కూడిన పోల్ చీటి పంపిణీ చేశారు. సీసీసీ నస్పూర్ మెయిన్ రోడ్డుపై ఇరువైపుల రాకపోకలకు వీలులేకుండా బారికేడ్లు అమర్చడంతో ఓటర్లు, అటువైపు వెళ్లే ప్రయాణికులు రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడ్డారు. చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు పట్టణం అంబేడ్కర్ చౌరస్తా వద్ద నల్ల కండువాతో నిరసన తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి పోలింగ్ సమయంలో పలువురితో వాగ్వాదానికి దిగారు. బెల్లంపల్లి పట్టణం 19వార్డు అభ్యర్థి కొమ్ముల జయ తనయుడు, మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ ఓటేసిన బ్యాలెట్‌పేపర్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. పోలింగ్ కేంద్రానికి సెల్‌ఫోన్‌తో ఎలా వెళ్లాడని అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఒకరు పోలింగ్ చీటిపై కారు గుర్తుతో సహా పంపిణీ చేశారని 31, 32వ వార్డుల్లో వీల్‌చైర్లు అందుబాటులో లేవని ఓటర్లు వాపోయారు. 29వ వార్డులో స్థానికంగా లేని వారిని ఓటేసేందుకు తీసుకొచ్చారని బీజేపీ అభ్యర్థి కోడి రమేశ్ ఆరోపించాడు. 22వ వార్డులో చనిపోయిన వ్యక్తి స్థానంలో ఒకరు ఓటేసేందుకు వచ్చారని ఏజెంట్లు గుర్తించారు. లక్సెట్టిపేట ఐదోవార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ తనను పోలింగ్ కేంద్రానికి ఏజెంట్‌గా వెళ్లనీయడం లేదంటూ బైఠాయించగా, పోలీసులు అతన్ని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
డబ్బుల పంపిణీపై ఆరోపణలు
జిల్లాలో పలు చోట్ల అభ్యర్థులు ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే ఓటర్లకు డబ్బులు పంచారు. చెన్నూరు పట్టణం రెండో వార్డు అభ్యర్థి భర్త ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాతనపల్లి 21వ వార్డు పోలింగ్ కేంద్రం వద్దనే ఎర్ర కారులో ముగ్గురు మహిళలతో బీఆర్‌ఎస్ అభ్యర్థి భర్త నేరుగా ఓటేసిన వారికి పంచారని స్వతంత్ర అభ్యర్థి సౌజన్య ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంకా మద్యం, బిర్యానీ ఇతర కానుకలు భారీగా పంపిణీ చేశారు. పోలింగ్‌కు ముందు రోజు రూ.వెయ్యి చొప్పున ఇచ్చి, పోలింగ్ జరిగే సమయం మధ్యాహ్నం వరకు మరోసారి కొందరు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. కొందరు రెండు వేల చొప్పున పంచారు. జిల్లా కేంద్రం సహా, అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే తంతు కొనసాగింది.
చంటి పాపతో పోలింగ్ కేంద్రంకు వస్తూ
శాతం
ఓట్లు
మున్సిపాలిటీ మొత్తం పురుషులు సీ్త్రలు పోలైన ఓట్లు పురుషులు సీ్త్రలు శాతం
మంచిర్యాల 181778 90646 91111 1,17,983 58,711 59,268 64.90
బెల్లంపల్లి 44554 21549 23002 33350 16337 17013 74.86
చెన్నూర్ 19903 9711 10191 15096 7412 7683 75.85
క్యాతన్‌పల్లి 29731 14732 14998 21368 10557 10811 71.87లక్సెట్టిపేట 18331 8765 9565 14078 6727 7351 76.80
మొత్తం 294297 145403 148867 2,01,876 99744 102126 68.60
నోట్ : ఇతర ఓటర్లు 27మంది ఉండగా, వీరిలో ఆరుగురు ఓటేశారు
మన్సిపాల్టీల్లోని ఓటర్ల వివరాలు
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
ఎన్నికల కోసం ఎంతో శ్రమించిన అభ్యర్థులు, తమకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కించే పనిలో పడ్డారు. రూ.లక్షలు ఖర్చు చేసినప్పటికీ పలువురు అభ్యర్థులకు ఆశించిన మేర ఓట్లు పడలేదనే నిరాశలో ఉన్నారు .మరికొందరు మాత్రం తాము గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఈ మేరకు బూత్‌ల వారీగా తమకు వచ్చిన ఓట్లు అంచనా వేస్తున్నారు. ఎక్కడ ఎలా పోలింగ్ జరిగాయో ఆరా తీసుకుంటున్నారు. పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అభ్యర్థులు కొందరు నిరాశలో పడ్డారు. సోషల్ మీడియాలో అభ్యర్థులు గెలుపోటములపై వాదనలు చేసుకుంటున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు తేలనున్నాయి. అయితే ఓ పార్టీ అభ్యర్థులు ఇప్పుడే క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.
తొలి ఓటు వేసిన సాయి అనురాగ్, సాయి సహనలక్ష్మి
ఐదేళ్ల క్రితం ఓట్లతో పోలిస్తే ప్రస్తుతం తగ్గుదల
మున్సిపాలిటీ 2020(శాతం) 2026 (శాతం)
బెల్లంపల్లి 77.99 74.86
లక్సెట్టిపేట 77.95 76.80
క్యాతనపల్లి 73.02 71.87
మంచిర్యాల 67.14 64.90
మున్సిపాలిటీ 7–9గం. 9–11గం. 11–1 గం. 1–3గం. 3–5గం. మంచిర్యాల 17,650 9.71 38,572 21.22 69,970 38.49 99,318 54.64 1,17,982 64.90 బెల్లంపల్లి 5,543 12.44 13,621 30.57 22,457 50.40 28,743 64.51 33,351 74.86చెన్నూర్ 2,952 14.83 7,403 37.20 11,539 57.98 13,936 70.02 15,096 75.85క్యాతన్‌పల్లి 4,139 13.92 9,175 30.86 15,385 51.75 18,725 62.98 21,368 71.87
లక్సెట్టిపేట 2,621 14.30 6,637 36.21 10,575 57.69 12,755 69.58 14,078 76.80
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం
పోలింగ్ సరళి.. ప్రతీ రెండుగంటలకు పోలైన ఓట్లు/శాతం


