మహిళపై అడవిపంది దాడి
వేమనపల్లి: అడవిపంది దాడిలో మహిళకు గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తొర్రెం మధునక్క బుధవారం తోటి కూలీలతో కలిసి పంటచేనుకు వెళ్తుండగా ఎంచ ప్రాంతంలో పిల్లల పంది ఆమైపె దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో వేమనపల్లి పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుశ్నపల్లి ఎఫ్‌ఆర్‌ఓ దయాకర్ ఆదేశాలతో బేస్ క్యాంప్ సిబ్బంది వెంకటి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
సల్యాదలో మరొకరిపై..
ఇచ్చోడ: మండలంలోని సల్యాద గ్రామానికి చెందిన ఇస్రుబాయి బుధవారం తమ పంట పొలానికి వెళ్లింది. పనిలో నిమగ్నమైన ఉండగా వెనుక నుంచి వచ్చిన అడవి పంది ఆమైపె దాడికి పాల్పడింది. మహిళ కేకలు వేయడంతో చుట్టు పక్కల పొలాల్లో ఉన్న వారు రావడంతో అడవిపంది అక్కడి నుంచి వెళ్లిపోయింది. మహిళకు తీవ్రగాయాలు కావడంతో 108కు సమాచారం అందించగా ఈఎంటీ అనిల్, ఫైలట్ వినోద్ ప్రథమ చిక్సిత్స అందించి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు.


