తుర్కం చెరువును సందర్శించిన ట్రైనీ ఎఫ్‌ఎస్వోలు
మామడ: తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీకి చెందిన 44 మంది ట్రైయినీ ఎఫ్‌ఎస్వోలు మండలంలోని నల్దుర్తి గ్రామ సమీపంలోని పర్యాటక ప్రాంతం తుర్కంచెరువును శుక్రవారం సందర్శించారు. ఇక్కడ గల వివిధ రకాల వృక్షజాతులు, జంతుజాతులు, పక్షిజాతుల గురించి స్థానిక అటవీ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప్రకృతిలోని వివిధ జీవజాతులు, పర్యావరణ వ్యవస్థలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ రేఖాభాను, అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసరావు, ఎఫ్‌ఎస్వో శ్రీనివాస్, ఎఫ్‌బీవోలు రాజు, లక్ష్మీనర్సయ్య, సరిత పాల్గొన్నారు.


