టెండర్ ఓట్లు వేశారు..
మంచిర్యాలక్రైం: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాలేజీ రోడ్ 41వ డివిజన్‌లో ఓటేసేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలకు చుక్కెదురైంది. గర్మిళ్ల హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో కవిత రాథోడ్, ఆకుల సరిత ఓటేసేందుకు వెళ్లారు. ఓటరు జాబితా పరిశీలించగా అప్పటికే వారి ఓటు నమోదైందని అధికారులు చెప్పారు. దీంతో అవాకై ్కన ఓటర్లు తమ ఓటు తమకు తెలియకుండా ఎవరు వేశారంటూ అధికారులను నిలదీశారు. దీంతో 15 నిమిషాలపాటు గందరగోళం చోటు చేసుకుంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరూ టెండర్ ఓటు వేసే అవకాశం కల్పించారు. కానీ వారిద్దరి పేరిట దొంగ ఓటు ఎవరు వేశారనేది పోలింగ్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
టెండర్ ఓట్లు వేశారు..


