చిన్నారుల సమాచారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల సమాచారం ఇవ్వండి

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

చిన్న

చిన్నారుల సమాచారం ఇవ్వండి

వరంగల్‌ క్రైం: కాజీపేట పోలీస్‌, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్‌ఫోర్స్‌, కాజీపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్‌లో కాజీపేట రైల్వే ప్లాట్‌ఫాం నుంచి, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతంలో, మరో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. చిన్నారుల తల్లిదండ్రులు సరైన ఆధారాలతో కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డిని 87126 85122 నంబరులో సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు.

చిన్నారుల సమాచారం ఇవ్వండి1
1/2

చిన్నారుల సమాచారం ఇవ్వండి

చిన్నారుల సమాచారం ఇవ్వండి2
2/2

చిన్నారుల సమాచారం ఇవ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement