వాట్సాప్ స్టేటస్‌లో ‘బ్యాలెట్’
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తల్లికి కేటాయించిన గుర్తుకు ఓటు వేసిన తనయుడు ఆ బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ తల్లి జయ 19వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసిన తనయుడు సురేష్ రహస్యంగా బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎన్నికల అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ ఎలా తీసుకెళ్లాడని ఆరా తీస్తున్నారు. ఓటు ఎవరికి వేశారనే విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి ఉండగా బహిర్గతం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


