అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

ఆదిలాబాద్‌టౌన్‌: అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నట్లు ఆదిలాబాద్‌ ఎఫ్‌డీవో విశ్వనాథ చిన్నబూసరెడ్డి తెలిపారు. గురువారం అటవీశాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్‌కు మ్యాక్స్‌ వాహనంలో కలప తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దస్నాపూర్‌లో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వాహనంలో 18 సైజులు ఉండగా వాటి విలువ రూ.64 వేల వరకు ఉంటుందన్నారు. వాహన డ్రైవర్‌ షేక్‌ అబ్బును అదుపులోకి తీసుకో గా, ఇచ్చోడకు చెందిన బిల్డర్‌ క్రాంతి, ఘోట్కురికి చెందిన వడ్రంగి వామన్‌, కర్ర సరఫరా చేసే స్మగ్లర్‌ గుండాలకు చెందిన హకీమ్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఓ ఇంటి నిర్మాణం కోసం గుండాలలోని హకీమ్‌ను సంప్రదించి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఆర్‌వో గులాబ్‌సింగ్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ రాథోడ్‌ గులాబ్‌, ఎఫ్‌బీవో కృష్ణనాయక్‌ పాల్గొన్నట్లు వివరించారు.

ఇచ్చోడ: మండలంలోని నవేగావ్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు ఎఫ్‌ఆర్వో పుండలిక్‌ తెలిపారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన కిషోర్‌ ఇంట్లో తనిఖీ చేయగా 150 సీఎంటీల టేకు కలప లభ్యమైనట్లు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి కలపను ఇచ్చోడ టింబర్‌ డిపోకు తరలించినట్లు తెలిపారు. కలప విలువ సుమారు రూ.13 వేలు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement