ఇంటిపన్నులు వంద శాతం వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటిపన్నులు వంద శాతం వసూలు చేయాలి

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

ఇంటిపన్నులు వంద శాతం వసూలు చేయాలి

ఇంటిపన్నులు వంద శాతం వసూలు చేయాలి

దండేపల్లి: ఇంటిపన్ను వసూళ్లు వందశాతం పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పన్ను వసూళ్లు త్వరగా పూర్తిచేయాలని అన్నారు. వసూళ్లలో వెనుకబడిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచాలన్నారు. నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్‌ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మండలంలోని కొర్విచెల్మ గ్రామాన్ని సందర్శించారు. జీపీ కార్యాలయంలోని రికార్డులు, రిజిష్టర్లను తనిఖీ చేశారు. నర్సరీని పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై పంచాయతీ సిబ్బంది, జీపీ కార్మికులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో జె.ప్రసాద్‌, ఎంపీవో కేవీ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement