‘నీల్వాయి’ నీరందేనా? | - | Sakshi
Sakshi News home page

‘నీల్వాయి’ నీరందేనా?

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

‘నీల్వాయి’ నీరందేనా?

‘నీల్వాయి’ నీరందేనా?

● ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులే ● ఆందోళనలో ఆయకట్టు రైతులు

వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్ట్‌ ఎడమ కాలువకు అనుబంధంగా నిర్మించిన 5ఆర్‌ కాలువ నిరుపయోగమైంది. 2005లో అప్పటి సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నీల్వాయి ప్రాజెక్ట్‌ నిర్మించారు. అప్పట్లో రూ.68 కోట్లతో ప్రారంభమై ఇప్పటివరకు రూ.224కోట్ల వరకు ఖర్చయినా పిల్ల కా లువకు సరిగా నీరందటంలేదు. కొన్ని చోట్ల అటవీ శాఖ అడ్డంకితో పనులు నిలిచాయి. ఇతర పెండింగ్‌ పనులు మిగిలిపోగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేయాలని సుమారు రూ.3కోట్ల వరకు నిధులు కేటాయించింది. ఇందులో భాగమైన 5 ఆర్‌ కా లువ పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఎడమ కాలువ పూర్తి చేశారు. 5ఆర్‌ కాలువ నిర్మాణంపై అ ధికారులు పూర్తిగా దృష్టి సారించటం లేదు. ఆరు నె లల క్రితం వరకు తూతూ మంత్రంగా పనులు చేప ట్టి వదిలి పెట్టారు. రూ.కోట్లు వెచ్చించి భూసేకరణ, కాలువ నిర్మాణం చేస్తూనే ఉన్నారు. కానీ, రైతు ల పంట పొలాకు సాగునీరందే పరిస్థితి లేదు. 5ఆర్‌ కాలువకు కేవలం రాజారం–మంగనపల్లి క్రాస్‌ రో డ్డు వరకే సాగునీరు అందుతోంది. మిగతా మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ నిరుయోగంగానే ఉంది. దశాబ్దాలు గడిచినా ఇదే పరిస్థితి ఉంది. 5ఆర్‌ కాలువ వెంట సాగునీరు ఎప్పుడు వస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులు, కాంట్రాక్ర్ట్‌ స్పందించి పెండింగ్‌ పసులు పూర్తి చేసి ఖరీఫ్‌ సీజన్‌ వరకై నా 5ఆర్‌ కాలువ వెంట సాగునీరందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement