గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇచ్చోడ: గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ ఎకై ్సజ్ సీఐ జుల్ఫీకర్ అహ్మద్ తెలి పారు. శుక్రవారం ఇచ్చోడ సీఐ కార్యాలయంలో వి వరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మే రకు గురువారం సాయంత్రం బోథ్ మండలంలోని దన్నూర్ నాగ్‌పూర్ రోడ్డు మార్గంలో సిబ్బందితో క లిసి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తని ఖీల్లో రాథోడ్ సచిన్ అనే వ్యకి బైక్‌పై సుమారు ఐదు లీటర్ల గుడుంబా తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా తయారీకి నల్లబెల్లం బోథ్ మండల కేంద్రంలోని శబరి కిరాణాషాపులో కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో సదరు కిరాణాషాపులో తనిఖీ చేయగా 30కిలోల నల్లబెల్లం లభించినట్లు తెలిపారు. గుడుంబా సరఫరా చేస్తున్న రాథోడ్ సచిన్‌తోపాటు కిరాణాషాపు యజమాని సిలారి నరసింహపై కేసు నమోదు చేసి బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో ట్రైనీ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది కార్తిక, మహ్మద్, దేవేందర్ పాల్గొనట్లు తెలిపారు.


