కళ్లలో కారం చల్లి పుస్తెలతాడు చోరీ
జన్నారం: ఇంట్లో ని ద్రిస్తున్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి మెడలో ని పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని తపాలపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. ఎస్సై అనూష, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తపాలపూర్ గ్రామానికి చెందిన రామటెంకి లావణ్య, తన భర్త రాజన్న, కూతురు ఆరాధ్యతో కలిసి గురువారం తన ఇంటిలో నిద్రించింది. శుక్రవా రం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి రేకులు చప్పుడు చేశాడు. పక్షవాతంతో బాధ పడుతున్న రాజన్న లేవలేని స్థితిలో ఉండగా లావణ్య వెళ్లి తలుపు తెరిచి చూసింది. ముఖానికి మాస్కు వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి లావణ్య కంట్లో కారం చల్లి ఆమెను కొట్టాడు. మెడలోని రెండు తు లాల బంగారు పుస్తెల తాడు లాక్కుని పరారయ్యాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


