పరిమితికి మించి..! | - | Sakshi
Sakshi News home page

పరిమితికి మించి..!

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

పరిమి

పరిమితికి మించి..!

విచ్చలవిడిగా ప్రచార వ్యయం ఓటర్లకు తాయిలాలతో గాలం పట్టని ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ‘లెక్క’ తప్పుతున్న అభ్యర్థులు?

నిర్మల్‌ఖిల్లా: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయపరి మితిని తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్‌ అభ్యర్థికి గరిష్టంగా రూ.5లక్షలు, కార్పొరేషన్‌ పరిధిలో కార్పొరేటర్‌ అభ్యర్థికి రూ.10 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులు ఈ పరిమితులను దాటుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధన ప్రవాహం మితిమీరకుండా ఎన్నికల అధికారులు కట్టడి చేయాలని పట్టణపౌరులు కోరుతున్నారు.

అంతటా అంతే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల మున్సిపల్‌ కా ర్పొరేషన్‌తో పాటు నిర్మ ల్‌, భైంసా, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ పదవి కోసం కనీసం రూ.15లక్షల నుంచి గరిష్టంగా రూ.40లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉదయం, సాయంత్రం వేళ గడపగడపకూ ప్రచారం, జనసమీకరణ, రోడ్‌ షోలు, విందులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రచార వ్యయం భారీగా పెరిగిపోతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక పాటల ప్రచార వాహనాలు, ప్రచార సామగ్రి అద్దెకు రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు అవుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఖర్చులన్నీ కలిపితే ఎన్నికల వ్యయం నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు మరో పది మున్సిపాలిటీల్లోని 328 స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరంతా విజయం కోసం తమశక్తిమేర అర్థబలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది.

అభ్యర్థుల ఎంపికలో పార్టీలు కూడా..

మరోవైపు రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక సామర్థ్యాన్నే ప్రధాన ప్రమాణంగా తీసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. టికెట్లు కేటాయించే దశలోనే అభ్యర్థి ఎంతవరకు ఖర్చు చేయగలడన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లాలో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో చా లామంది ఖర్చుకు వెనకాడని స్థితిలో ఉన్నవారేనన్న చర్చ జరుగుతోంది. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతూ, అనుచర వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు ఎంత ఖర్చు చేస్తే అంత ప్రచార ఆర్భాటం కనిపిస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికల వ్యయపరిమితిపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా ఉండాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

ఎన్నికల సంఘం నిర్దేశించిన గరిష్ట వ్యయపరిమితి

మున్సిపాలిటీలు, వార్డులు, అభ్యర్థుల వివరాలు

మున్సిపాలిటీ గ్రేడ్‌లు డివిజన్లు/వార్డులు అభ్యర్థులు

మంచిర్యాల స్పెషల్‌గ్రేడ్‌ 60 122

ఆదిలాబాద్‌ 1 49 314

నిర్మల్‌ 1 42 182

భైంసా 1 26 115

బెల్లంపల్లి 1 34 77

కాగజ్‌నగర్‌ 2 30 130

ఖానాపూర్‌ 3 12 56

ఆసిఫాబాద్‌ 3 20 94

క్యాతన్‌పల్లి 3 22 80

చెన్నూరు 3 18 47

లక్సెట్టిపేట 3 15 97

మొత్తం – 328 1,314

కార్పొరేటర్‌ అభ్యర్థి రూ.10లక్షలు

గ్రేడ్‌–1 మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి రూ.5 లక్షలు

గ్రేడ్‌–2 మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి రూ.4లక్షలు

గ్రేడ్‌–3 మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి రూ.3లక్షలు

పరిమితికి మించి..!1
1/1

పరిమితికి మించి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement