రూ.1.08 లక్షలు పట్టివేత
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం సిర్పూర్ (టి)కి చెందిన బొడ్డు రాజయ్య నిర్మల్ నుంచి కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నా రు. రెవెన్యూ డీటీ అతిష్, కానిస్టేబుళ్లు ఆనంద్, సునీల్.. ఎన్‌టీఆర్ చౌరస్తా వద్ద కారును తనిఖీ చేయగా రూ.1.08 లక్షలు లభ్యమయ్యాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు రాజయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి దిలీప్‌కుమార్ తెలిపారు.


